SriMukhudu – Satavahana Dynasty Founder – శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు

SriMukhudu – Satavahana Dynasty Founder – శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు .శ్రీముఖుడు / సిముఖుడు / చిముకుడు. ఇతను శాతవాహన రాజ్యస్థాపకుడు. శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహన వంశ మూల పురుషుడు శాతవాహనుడు. ఇతని తండ్రి పేరు – శాతవాహనుడు. శాతవాహనుడి యొక్క నాణెములు మెదక్ లోని కొండాపూర్‌లో లభ్యమయ్యాయి. శాతవాహనుడు మౌర్య సామంతుడిగా ఉండేవాడని పేర్కొంటారు.

అశోకుని 13వ శిలాశాసనం ప్రకారం శ్రీముఖుడు కూడా అతని సామంతుడు. అశోకుడు శ్రీముఖునికి ‘రాయ’ అనే బిరుదు ఇచ్చారని ప్రముఖ చరిత్రకారుడు డి.సి.సర్కార్ పేర్కొన్నారు. శ్రీముఖిడి బిరుదు ‘గాయ’ పేరు మీద గోదావరి ఒడ్డున కోటిలింగాలకు ఐదు కిలోమీటర్ల దూరంలోనే రాయపట్నం అనే గ్రామము ఏర్పడినది.

SriMukhudu – Satavahana Dynasty Founder – శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు

కొందరు చరిత్ర కారుల ప్రకారం శ్రీముఖుడు (సీముకుడు) స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. క్రీ.పూ.271 నుంచి 248 (23 ఏళ్లు) (In some histories it is క్రీ.పూ. 231-208) వరకు పాలించాడు. ఇతను 23 సం||లు పరిపాలించినట్లు “మత్స్యపురాణం”లో పేర్కొనబడింది.

ఇతను మొదట జైన మతాభిమాని. తర్వాత వైదిక మతాభిమానిగా మారినట్లు తెలుస్తుంది.

శ్రీ ముఖుడు మహారాష్ట్రలోని రధికులను జయించి వారి నాయకుడైన మహారధి త్రణకైయిలో కుమార్తె అయిన దేవి నాగానికను తన కుమారుడైన మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం జరిపించాడు


The Simuka inscription (photograph and rubbing) at the Naneghat Caves, in early Pali script:

దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనంలో “సిరిముఖ శాతవాహన సిరిమల” తో అని సిముఖుని కీర్తించింది. బట్టి ఈ రాజవంశానికి శ్రీముఖుడివల్ల కాక ‘శాతవాహన’ అనే వ్యక్తి పేరు మీదుగా శాతవాహన పేరు వచ్చిందనేది తెలుస్తోంది.
అశోకుడికి సామంతరాజుగా ఉన్న శాతవాహనుడనే రాజు, చక్రవర్తి మరణాంతరం దక్కనులో తనస్థానం పదిలం చేసుకొని, తన కుమారుడు స్వాతంత్రం ప్రకటించుకోడానికి మార్గం ఏర్పరచినట్లు తెలుస్తోంది. శ్రీముఖుడు అధికారంలోకి వచ్చిన తరువాత, స్వాతంత్ర్యం ప్రకటించుకొని, తన రాజవంశానికి తండ్రి పేరు పెట్టి ఉండవచ్చని భావించవచ్చు

శ్రీముఖుడి నాణేలు కరీంనగర్ జిల్లా కోటిలింగాల ప్రాంతంలో లభ్యమయ్యాయి. ఇటీవల కోటి లింగాలలో లభించిన నాణేములలో శ్రీముఖుడు “చిముఖ” అని పేర్కొనబడ్డాడు. సీముఖ, సైముక, చిముక, సింధుక అనేవి ఇతని పేర్లకు పర్యాయ పదాలుగా పిలువబడింది.

సంగారెడ్డి, కొండాపూర్ (మెదక్ జిల్లా) కర్ణాటకలోని సన్నతి, మహారాష్ట్ర లోని నెవాస, జున్నార్, అకోల ప్రాంతాల్లో శ్రీముఖుని నాణేలు దొరికాయి. శ్రీముఖుని నాణేములు కరీంనగర్ జిల్లా “మునగులగుట్ట, కోటి లింగాలలో” బయల్పడినవి. ఈ నాణేముల వలన అతడు జైన మతాభిమాని అయినట్లు తెలుస్తుంది.


  • శ్రీముఖుడు నాణెములలో ఇతని పేరు చిముక అని పేర్కొనబడింది
  • శ్రీముఖుడు ప్రతిష్టానపురము రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. మొదటిగా కోటిలింగాల నుంచి పాలించాడు)
  • శ్రీముఖుని నాణెముల పై ‘రణగోభద్ర’, ‘రణ గోస్వామి’ అనే పేర్లు రాసి ఉన్నాయి.
  • నాగానిక తన నానాఘాట్ శాసనంలో ‘సిరిచిముకశాత’ అనే పదములను తెలియజేసినది.
  • శ్రీముఖుడు అనేక యుద్ధాలు చేశాడు.
  • ఇతను రాఠీకులు అనే నాగ తెగ వారిని ఓడించి వారితో వివాహ సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. రాఠీకుల రాజు అయిన మహారధ త్రైన కైరో కుమార్తె నాగానికను తన కుమారుడు 1వ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు. శ్రీముఖుడు మొదట్లో జైన మతాభిమాని. ఇతని జైన మత గురువు కాలకచూరి. తర్వాత కాలంలో ఇతను వైదిక మతాన్ని స్వీకరించాడు.
  • శ్రీముఖున్ని నాగానిక తాను వేయించిన నానాఘాట్ శాసనంలో పేర్కొంది. * రణగోభద్ర, రణగోస్వామి అనే పేర్లున్న నాణేములు శ్రీముఖుడు వేయించినవి.
  • శ్రీముఖుడి కుమారుడు 1వ శాతకర్ణి మైనర్ కావడం వల్ల ఇతని సోదరుడు కణ్పుడు లేదా కృష్ణుడు పాలకుడు అయ్యాడు.
Scroll to Top