1st Kanpudu/ Krishnudu /Kanha The Satavahana Ruler- మొదటి కృష్ణుడు/ కణ్పుడు శాతవాహన రాజు

కణ్పుడు/కృష్ణుడు . శ్రీముఖుడి కుమారుడు 1వ శాతకర్ణి మైనర్ కావడం వల్ల ఇతని సోదరుడు కణ్పుడు లేదా కృష్ణుడు పాలకుడు అయ్యాడు..  శ్రీముఖుడి తరువాత అతని తమ్ముడు మొదటి కృష్ణుడు పరిపాలన చేశాడు., ఇతను 2వ శాతవాహన రాజు గా చెప్పుకోవచ్చు. కృష్ణుడు (కన్ష్మ క్రీ.పూ. 208 -198) 


1st Kanhudu/ Krishnudu Satavahana Emporer – మొదటి కృష్ణుడు/ కణ్పుడు శాతవాహన రాజు


కృష్ణుడు (కన్ష్మ క్రీ.పూ. 208 -198) 

  • శ్రీముఖుని కుమారుడు మొదటి శాతకర్ణి యుక్త వయస్కుడు కానందున శ్రీముఖుని తమ్ముడు అయిన కృష్ణుడు సింహాసనం ఎక్కి పది సం||లు పాలించినాడు.  ఇతను 2వ శాతవాహన రాజు గా చెప్పుకోవచ్చు.
  • అశోకుడు మరణించిన తర్వాత అస్తవ్యస్తమైన మగధ రాజ్య పరిస్థితులను అవకాశముగా తీసుకొని కృష్ణుడు స్వతంత్ర అధికారమును స్థాపించినాడు. తన రాజ్యంను నాసిక్ వరకు విస్తరించినాడు.
  • ఇతడు కనేరి, నాసిక్ గుహలను తొలిపించాడు. నాసిక్ లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ధర్మమహామాత్య అనే అధికారులను నియమించాడు. ఇతని కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది. 
  • నాసిక్ లో ‘శ్రమణుల’ కోసం ఒక గుహాను త్రవ్వించి మహమాత్రుడ్ని నియమించినాడు. కచేరి శాసనంలో ‘మహామాత్ర’ పదం వల్ల శాతవాహనులు మౌర్యుల పాలన విధానం అనుసరించినట్లు తెలుస్తుంది. 
  •  నాసిక్ లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కోసం “ధర్మ మహామాత్య” అనే అధికారులను నియమించాడు. ఇతని కాలంలో ఆంధ్రాలో “భాగవతం” ప్రవేశపెట్టబడెను.
  • భారతదేశంలో భాగవతమతంగా ఉన్నట్లు హెలియోడోరస్ బేస్ నగర్ శాసనం తెలియజేస్తున్నది. భాగవత మతం మగధ పాలకుడైన పుష్యమిత్ర శుంగుడి కాలంలో ఆవిర్భవించింది.
  • భాగవత మత స్థాపకుడిగా శ్రీకృష్ణుడిని పరిగణిస్తారుశ్రీముఖుడి మరొక తమ్ముడు హుకు.. హుకుశ్రీని నానాఘాట్ శాసనంలో రాజకుమారుడిగా పేర్కొనబడ్డాడు.
  • కర్నూలు జిల్లాలోని పిఠాపురంలో దొరికిన ఒక సీసపు బిళ్ళ మీద హుకుశ్రీ పేరు ఒక వైపు, రోమన్ చక్రవర్తి టైబీరియస్ బొమ్మ మరోవైపు ఉన్నాయి.
  • ఇటీవల కోటిలింగాల దగ్గరి మొక్క ట్రాపుపేట గ్రామం వద్ద దొరికిన ఒక శాసనంలో హుకుశ్రీ మొదటి శాతకరి, నాగానికల కుమారుడుగా పేర్కొనబడ్డాడు.
  • ఇతడు శాతవాహనులలో మొదటిసారిగా శాసనాలు ముద్రించాడు.



Scroll to Top