Satavahana's Inscriptions – శాతవాహనుల శాసనాలు

Satavahana’s Inscriptions – Andhra Inscriptions శాతవాహనుల శాసనాలు – ఆంధ్రదేశంలో మొదట శాసనములు అశోకుడు వేయిం చారు. ఆంధ్రదేశములో మొదటగా శాసనాలు వేయించిన ఆంధ్ర రాజులు శాతవాహనులు.

  • బూఫ్టర్ శాతవాహనుల శాసనాల పై విస్తృతంగా అధ్యయనం చేశాడు.
  • శాతవాహనుల అధికార భాష, శాసనాలతో వాడిన భాష. రెండూ కూడా ప్రాకృతమే.
  • అశోకుని యొక్క 13వ శిలాశాసనం ప్రకారం శాతవాహనులు మౌర్యుల సామంతులనీ మరియు శాతవాహనులు ఆంధ్రభృత్యులని తెలుస్తున్నది.
  • నాగానిక వేసిన నానాఘాట్ శాసనం ద్వారా శాతవాహనులు, మరాఠాల మధ్య గల వివాహ సంబంధాలు మొదటి శాతకర్ణి విజయాలు, అతని గొప్పతనం గురించి మొదలైన అంశాల గురించి తెలుస్తున్నది.
  • కళింగ ఖారవేలుని హాతిగుంఫా శాసనం ప్రకారం ఖారవేలుడు మొదటి శాతకర్ణిపై దాడి చేసి, ఆ నగరానికి ‘పితుండ’ అనే పేరు పెట్టినట్లు తెలుస్తున్నది.
  • గౌతమీ బాలశ్రీ ప్రాకృతంలో వేసిన నాసిక్ శాసనంలో ‘రాజర్షిపత్ని’గా ఆమెను పేర్కొనడం జరిగింది.


Satavahana’s Inscriptions – Andhra Inscriptions శాతవాహనుల శాసనాలు


శాసనం వేయించిన వారు విశిష్టత
నానాఘాట్ శాసనం నాగానిక ఇది శాతకర్ణి – 1 పాలన గురించి తెలియచేస్తుంది.  మొదటి శాతకర్ణి భార్ దేవీ నాగానిక ప్రాకృత భాషలో వేయించినది.  నానాఘాట్ శాసనం బౌద్ధ గుహలు లో ఉంది . వైదిక క్రతువులు నిర్వహించుచున్న రాజును ప్రశంసిస్తున్న శాసనం.  శాతవాహనులు మరాఠాలు మధ్యగల వైవాహిక సంబంధాలు గురించి తెలిపింది
బిల్సా శాసనం 2వ శాతకర్ణి
నాసిక్ శాసనం గౌతమీ బాలశ్రీ (రాజర్షి పత్ని) గౌతమీపుత్ర శాతకర్ణి ఘన విజయాలురింి గౌతమి  బాలశ్రీ( తల్లి ) నాసిక్ శాసనంవేశారు. 
 శివస్వామి,  మహాగుప్తులు ఈ శాసనాన్ని రచించారు. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణిని .. బేనాకటక స్వామి అని బాలశ్రీ సంబోధించారు. ఈ శాసనాన్ని బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వేయలేదు. తన మనవడైన, గౌతమీపుత్రశాతకర్ణి కొడుకైన వాశిస్టీపుత్ర పులోమావి కాలంలో వేసింది. గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి పత్ని గా పేర్కొంది
కార్లే  శాసనం 2వ పులోమావి గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను గురించి తెలుపుతుంది.ఏపిటీచర్స్.ఇన్
ధరణీకోట శాసనం 2వ పులోమావి ఆంధ్రలో తొలి శాతవాహన శాసనం. ఆంధ్రలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం అమరావతి శాసనం (ప్రాకృత భాషలో) ఈ శాసనం అమరావతి స్థూపం యొక్క ప్రాకార ద్వార స్థంభం పై చెక్కబడింది. ఈ శాసనములోనే మొట్టమొదటి తెలుగు పదము అయిన ‘నాగబు’ లభించినది. పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఆంధ్రకు వ్యాపించిందని ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది
చినగంజాం శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి
నాగార్జునకొండ శాసనం విజయశ్రీ శాతకర్ణి
మ్యాకదోని శాసనం 3వ పులోమావి గ్రామ పరిపాలన గురించి, గౌల్మిక గురించి తెలియజేస్తుంది శాసనం శాతవాహనుల గ్రామ పాలన గురించి మరియు గ్రామంలో ముఖ్య శాంతిభద్రతల అధికారి అయిన గుల్మిక గురించి , శాతవాహన రాజ్య పతనం వివరాలు అందిస్తుంది
ఉన్నాఘర్ శాసనం 3వ పులోమావి మంత్రిమండలి గురించి, శాతవాహన పతనం గురించి తెలియజేస్తుంది.
అంధౌ శిలా శాసనం 3వ పులోమావి శాతవాహనుల పరిపాలన గురించి తెలియజేసే శాసనం
జునాఘడ్ శాసనం రుద్రదాముడు సంస్కృతంలో జారీ చేసిన మొదటి శాసనం . శాతవాహనులు మరియు ఉజ్జయిని క్షాత్రపుల వైవాహిక సంబంధాలు గురించి తెలియ చేయ శాసనం
భట్టిప్రోలు నిగమ సభ శాసనం కుబేరుడు కుబేరుడు వేసిన భట్టిప్రోలు నిగమ సభ శాసనం శాతవాహనుల కాలం నాటి నిగమ సభలను గురించి తెలియజేస్తున్నది.
సాంచీ శాసనం రెండవ శాతకర్ణి ఈ శాసనం రెండవ శాతకర్ణి  ని “రాజస్యశ్రీ శాతకర్ణి” గా పేర్కొంది.
Scroll to Top