Kuntala Saatakarni – Saatavahana King – కుంతల శాతకర్ణి – శాతవాహన రాజు. ఇతను 13వ శాతవాహన రాజు. ఇతనికి విక్రమార్క అనే బిరుదు కలదు. సంస్కృత బాషాను రాజబాషగా పాటించిన రాజు.
Kuntala Saatakarni – Saatavahana King – కుంతల శాతకర్ణి – శాతవాహన రాజు
- కుంతల శాతకర్ణి శాతవాహన రాజు.
- ఇతను 13వ శాతవాహన రాజు .
- ఇతని బిరుదు – విక్రమార్క,
- ఇతని కాలంలో సంస్కృతం అభివృద్ధి చెందింది.
- ఇతని ఆస్థానంలోని శర్వవర్మ ‘కాతంత్ర వ్యాకరణం’ను సంస్కృతంలో రచించాడు.
- (తన రాజు కుంతల శాతకర్ణి ఆరు నెలలలో సంస్కృతం నేర్చుకొనుట కొరకు ఈ పుస్తకాన్ని రచించాడు. గుణాడ్యుడు మరియు శర్వవర్మ మధ్య కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పించే విషయంలో పోటీ ఏర్పడింది. ఈ పోటీ ప్రకారం కుంతల శాతకర్ణికి ఆరు నెలల్లో శర్వవర్మ సంస్కృతాన్ని నేర్పిస్తే గుణాడ్యుడు అడవులకు వెళ్లిపోవాలి. శాతకర్ణి సంస్కృతం నేర్చుకోకపోతే శర్వవర్మ అడవులకు వెళ్లాలి. కానీ, కుంతల శాతకర్ణి ఆరునెలల్లోనే సంస్కృతాన్ని నేర్చుకోవడంతో గుణాడ్యుడు అడవులకు వెళ్లిపోయాడు. ఈ పోటీ గురించి సోమదేవుడు తన కథాసరిత్సాగరంలో వివరించాడు)
- కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకున్న తరువాత ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను రాజభాషగా ప్రకటించారు.
- ఇతని ఆస్థానంలోనే గుణాఢ్యుడు పైశాచిక భాషలో బృహత్కథను రచించాడు. (ఇది విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించుటకు ఆధారమైంది) బృహత్ కథ ఆధారంగా అనేక గ్రంథాలు రచించబడ్డాయి. వాటిలో ప్రధానంగా క్షేమేంద్రుడు ‘బృహత్ కథామంజరి’, హరిసేనుడు ‘బృహత్ కోష’, వరాహమిహిరుడు ‘బృహత్ సంహిత’ను, సోమదేవుడు ‘కథాసరిసరిత్సాగరము’ను రచించారు.
- ఈ పైశాచిక భాషను దినేష్ చంద్ర సర్కార్ ప్రాచీన తెలుగుభాషతో పోల్చాడు.
- కుంతల శాతకర్ణి భార్య మలాయావతి కరిర్త అనే రతి భంగిమ కారణంగా మరణించింది
కుంతల శాతకర్ణి గూర్చి ఈ క్రింది గ్రంథాల్లో ప్రస్తావించబడింది
- 1. వాత్సాయనుడి కామసూత్రం (దీన్ని తెలుగులోకి అనువదించినవాడు – పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి. శాతవాహనుల కాలం నాటి ‘సాంఘిక జీవన విధానము గురించి కామసూత్ర తెలియజేస్తుంది.
- రాజశేఖరుడి కావ్యమీమాంస
- గుణాడ్యుడి బృహత్కథ.
ఇతని తర్వాత స్వాతికర్ణి పాలించాడు.