Satakarni II – Satvahana King – 2వ శాతకర్ణి – శాతావహన రాజు – రాజన్య శ్రీ శాతకర్ణి

Satakarni II – or 2nd Satakarni – Satvahana King –  2వ శాతకర్ణి – శాతావహన రాజు – రాజన్య శ్రీ శాతకర్ణి .  ఇతను అత్యధికంగా 56 సం||లు పాలించాడు.  ఇతని బిరుదు : రాజన్య శ్రీ శాతకర్ణి. ఇతను 6 వ శాతవాహన రాజు. ఇతని పరిపాలన దాదాపు క్రీ పూ  166 నుండి క్రీ పూ 111 వరకు పరిపాలించెను. 

2nd Satakarni – Satvahana King –  2వ శాతకర్ణి – శాతావహన రాజు – రాజన్య శ్రీ శాతకర్ణి 

  • 2 వ శాతకర్ణి కి రాజన్య శ్రీ శాతకర్ణి అనే బిరుదు కూడా కలదు.
  • శాతవాహనులలో అత్యధిక కాలం 56 సంవత్సరాలు పరిపాలించిన రాజు.
  • ఇతని ఆ స్థానంలో వశిష్ఠపత్ర ఆనంద అనే కళాకారుడు ఉండేవాడు.
  • రెండవ శాతకర్ణి కాలంలో గతంలో శాతావహనులు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు అని అతని యొక్క ‘భిల్సా శాసనం’లో పేర్కొనబడింది.
  • హాతిగుంప మరియు భిల్సా శాసనాలలో పేర్కొన బడిన రాజు ఇతనే అని చరిత్రకారుల భావన.
  • రెండవ శాతకర్ణి పరిపాలనా కాలంలోనే శకులు, శాతవాహనుల మధ్య ఘర్షణలు మొదలయ్యా యి.
  • రెండవ శాతకర్ణి యొక్క నాణెములు తెలంగాణ, మహారాష్ట్ర, మాళ్వా ప్రాంతాలలో లభించాయి.
  • మాళ్వా ప్రాంతంలో లభించిన నాణెమల మీద ‘రాథోసిరి సతకనిక’ అని రాయబడి ఉంది.
  • ఇతను సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు. (ఇతని ఆస్థానానికి చెందిన ఆనందుడు సాంచీ దక్షిణ తోరణంపై ఒక శాసనాన్ని చెక్కించాడు)
  • శుంగ రాజు ఐన పుష్యమిత్ర శుంగుడి మరణానంతరం 2వ శాతకర్ణి విదిశను ఆక్రమించాడు.
  • యుగ పురాణం ప్రకారం ఇతను మగధ మరియు కళింగ ప్రాంతాలను కూడా పాలించాడని తెలుస్తోంది.
  • 2వ శాతకర్ణిని ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశరాజుగా పేర్కొంటారు.
  • ఇతని తర్వాత లంబోధరుడు, అపిలకుడు, మేఘస్వాతి మొదలగు వారు పాలించారు.

Scroll to Top