Psychology Unit -1 Introduction of Psychology – Edn Psychology for DSC Teachers Recruitment

Psychology Unit -1 Introduction of Psychology – Edn Psychology for DSC Teachers Recruitment. In this Post,we will discuss about the Introduction of Psychology, Educational Psychology. What is Psychology, How is it useful in Education System, Why every Teacher should study Child Psychology. Details are explained in Telugu. Very Useful for DSC/ TET/ Teachers Recruitment Exam

Psychology Unit -1 Introduction of Psychology – Edn Psychology for DSC Teachers Recruitment


పరిచయం – విద్యా మనోవిజ్ఞానశాస్త్రం మనోవిజ్ఞానం-నిర్వచనం – Definition of Psychology
సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవడానికి మానవుడు సంఘజీవిగా ఉండటానికి విద్య అవసరం ఎంతైనా ఉంది.
సంప్రదాయ పద్ధతిలో విద్యను బోధించే వ్యవస్టే పాఠశాల. పాఠశాల నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించిన విభాగమే తరగతి గది.
తరగతి గదికి కేంద్ర బిందువు – “విద్యార్థి’. పాఠశాల వ్యవస్థ రూపొందింది విద్యార్థి కోసం. తరగతిగదిలో జరిగే బోధనాభ్యాస ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు, తాత్వికుడు, స్నేహితుడు (Guide, philosopher and friend).

విద్య అనే పదంలో వికసింపచేయడం, నేర్పించడం లేదా అభ్యసింపచేయడం అనే ప్రక్రియలున్నాయి. అభ్యసన ఎట్లా జరుగుతుందో, విద్యార్థుల్లో ‘వికాసం’ ఎట్లా సంభవిస్తుందో, విద్యార్థుల్లో జరిగే అభ్యసనానికి-వికాసానికి ఉన్న సంబంధమెట్లాంటిదో ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి.

విద్యార్థుల్లో వ్యక్తిగతమైన తేడాలు చాలా ఉంటాయి. ఈ తేడాలు విద్యార్థికి పుట్టుకతో వస్తాయి. ఇవి కాక సాంఘిక, ఆర్థిక పరిస్థితులలో ఉండే తేడాలు కూడా విద్యార్థుల అభ్యసనం మీద ప్రభావం చూపుతాయి. ఒకే వయస్సులో ఉన్న విద్యార్థుల్లో కొందరు వేగంగా విషయాంశాలను అభ్యసిస్తే మరికొందరు మందకొడిగా అభ్యసిస్తారు. ఈ తేడాలను గ్రహించని ఎంత మంచి ఉపాధ్యాయుడైనా విద్యార్థుల అభ్యసనాన్ని సక్రమంగా పెంపొందించలేడు.

అభ్యసనాన్ని ఒక శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించే శాస్త్రమే మనోవిజ్ఞానశాస్త్రం. ప్రవర్తన ఎట్లా రూపొందుతుంది? అభ్యసన స్వరూపం, స్వభావాలేమిటి? అనే విషయాల పై ప్రయోగాలు చేసి, సిద్ధాంతాలను, సూత్రాలను రూపొందించి, విద్యా విషయాలకు అన్వయించి ఉపాధ్యాయునికి తరగతి గదిలో బోధనాభ్యసన సన్నివేశాలను సమర్థవంతంగా నిర్వహించటానికి మనోవిజ్ఞానశాస్త్రం తోడ్పడుతుంది.

మనోవిజ్ఞానశాస్త్రం ఉపాధ్యాయునికి అతని వృత్తిపట్ల ఒక అవగాహన కల్పిస్తుంది. బోధనాభ్యసన ప్రక్రియలో ఏర్పడే సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. అతని పనిని సులభతరం చేస్తుంది. ఏవిధంగా అయితే – కొయ్యకుర్చీలు, బల్లలు, తలుపులు చేయడానికి కరం తెలియాలో, కుండలు చేయడానికి మట్టి స్వభావం తెలియాలో, వస్త్రాలు నేయడానికి నూలు స్వభావం తెలియాలో అదేవిధంగా – ఉపాధ్యాయునికి, తమ విద్యార్థుల స్వభావం తెలియాలి. ప్రవర్తన గురించి వివరించే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం, కాబట్టి ఇది ఉపాధ్యాయునికి చాలా సహాయపడుతుంది. 


మనోవిజ్ఞానం-నిర్వచనం – Definition of Psychology

మనోవిజ్ఞానశాస్త్రాన్ని ఆంగ్లంలో ‘సైకాలజీ’ (Psychology) అంటారు. ఈ పదం ‘సెకె’ (Psyche), ‘లోగోస్’ (Logos) అనే గ్రీకు పదాలనుంచి ఉద్భవించింది. సైకే అనే పదాన్ని గ్రీకు తత్వవేత్తలు ‘ఆత్మ/మనస్సు’ అనే అర్థాలతో ఉపయోగించేవారు. మనోవిజ్ఞాన శాస్త్రం ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రంగా గుర్తించి, తత్వశాస్త్రంలోను, వేదాంత శాస్త్రంలోను ఒక భాగంగా భావించారు. ఆత్మ ఒక మూర్త పదార్థం కాదు. అమూర్తమైంది. ఆత్మ అంటే ఏమిటో వివరించడం కష్టం. ఆత్మను పరిశీలించడం సాధ్యంకాదు. దాని స్వభావం నిర్దిష్టంగా ఇది అని చెప్పలేము. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రం ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అనే నిర్వచనాన్ని తోసిపుచ్చడం జరిగింది. ఆత్మ అంటే ఏమిటి? దాన్ని అధ్యయనం చేయడం , ఎట్లా? అనే ప్రశ్నలకు సరియైన సమాధానాలను శాస్త్రవేత్తలు రాబట్టలేకపోయారు.

తరవాత ‘మనోవిజ్ఞాన శాస్త్రం మనస్సును అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించారు. మనస్సు అనేది ఆత్మ అంతటి నిగూఢమైన మాట కాకపోయినా మనస్సు అంటే ఏమిటి? దాన్ని అధ్యయనం చేయడం ఎట్లా? అనే ప్రశ్నలకు తావిచ్చింది. ఆత్మలాగానే మనస్సు కూడా అస్తిత్వంలేని అమూర్త విషయం కాబట్టి పై నిర్వచనాన్ని కూడా తోసిపుచ్చారు.

అరిస్టాటిల్ ఆత్మను రెండు విభాగాలుగా గుర్తించాడు

అరిస్టాటిల్ ఆత్మను రెండు విభాగాలుగా గుర్తించాడు. అందులో ఒకటి నిష్క్రియాత్మకమైంది. రెండవది క్రియాత్మకమైంది. క్రియాత్మకమైన మనస్సు వ్యక్తిని చైతన్యపరుస్తుందని, కృత్యాలు చేయడానికి ప్రేరణనిస్తుందని, మానసిక శక్తిని ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నాడు. 

 

Aristotle
Aristotle

‘వ్యక్తి చైతన్యపూరితుడుగా ఉన్నప్పుడు అతని మనస్సును పరిశీలించవచ్చని భావించిన సెయింట్ అగస్టీన్ (Saint Augustine) అనే తాత్వికుడు మనస్సును అంతరీక్షణ/ అంతఃపరిశీలన (Introspection) పద్ధతి ద్వారా అధ్యయనం చేయవచ్చు అభిప్రాయపడ్డాడు.

St. Augustine
St Augustine



1879లో జర్మనీలోని లీజ్గ్ నగరంలో విల్ హెల్, ఊంట్ (Wilhelm wundt) మొట్టమొదటి  ప్రయోగశాలను ప్రారంభించి, అంతఃపరిశీలన పద్ధతి ద్వారా చెతనాన్ని (Consciousness) అధ్యయనం చేశాడు. విలియం జేమ్స్, విల్‌హామ్ ఊంట్ అనే శాస్త్రజ్ఞులు ‘మనో విజ్ఞానం’ మనస్సులోని చేతనత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించారు.

wilhelm wundt
Wilhelm wundt

కాని సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త కొన్నివేల మందిపై ప్రయోగాలు, పరిశోధనలు జరిపి వ్యక్తుల ప్రవర్తనలకు ‘అచేతనం’ కూడా ఆధారమని తన ‘అచేతన ప్రేరణ సిద్ధాంతం’ (Unconscious Motivation) ప్రతిపాదించాడు. కాబట్టి మనోవిజ్ఞానం కేవలం వ్యక్తి చేతనా ప్రవర్తననే అధ్యయనం చేస్తుందన్న నిర్వచనాన్ని సహేతుకంగా తిరస్కరించడం జరిగింది.

Sigmund Freud
Sigmund Freud

చివరికి ప్రవర్తనా వాదులైన జె.బి. వాట్సన్(J.B. Watson) తదితరులు మనోవిజ్ఞానం అన్నిరకాల ప్రవర్తనలను అధ్యయనం చేసే శాస్త్రంగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ‘మనోవిజ్ఞాన శాస్త్రం’ ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించడం జరిగింది

J.B. Watson
J.B. Watson

 ఉడ్వర్ (Woodworth) పై నిర్వచనాలను సమీక్షిస్తూ ‘మనోవిజ్ఞానం మొదట తన ఆత్మను, తరవాత తన మనస్సును పోగొట్టుకుంది. చివరికి తన చేతనత్వాన్ని కూడా పోగొట్టుకొని, ప్రస్తుతం తన ప్రవర్తనను మాత్రం నిలుపుకొంది’ అని చమత్కరించాడు.

Next:

Scroll to Top