Satavahanas – Introduction – Satavahana Dynasty – Andhra Telangana
శాతవాహన రాజవంశ స్థాపనతో ఆంధ్రుల చరిత్రలోనే గాక దక్షిణ భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. మౌర్య సామ్రాజ్య పతనాంతరం ఉత్తర భారతం అల్లకల్లోమపుతున్న సమయంలో దక్షిణపథమును సమైక్యం చేసి ఒక దశలో పాటలిపుత్రంలో కూడా విజయపతాకము ఎగురవేసి, దేశంలో సాంస్కృతికంగా ఏకత్వాన్ని సాధించి శాతవాహనులు చరిత్రలో ప్రసిద్ధులయ్యారు. శాతవాహనులు పురాణాల ప్రకారము 30 మంది ఆంధ్రులు 450 సం|| కాలం పరిపాలించినట్లు చెప్పుతున్నాయి. శాతవాహనులకు “సాతవాహనులు, శాలివాహనులు, శాతర్జులు, ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులని” పేర్లు ఉన్నాయి.
ఆంధ్రదేశ చరిత్రలో ఆంధ్రదేశాన్ని పాలించిన మొట్టమొదటి రాజులు శాతవాహనులు. కొన్ని పురాణాలు ఈ రాజులనే “ఆంధ్రభృత్యులని” వ్యవహరిస్తున్నాయి. అనగా శాతవాహనులు ఆంధ్రులకు సామంతులుగా నుండి స్వతంత్రాధికారాన్ని సాధించినారు. కొన్ని పురాణాలు పేర్కొన్న శాతవాహనులు రాజుల పేర్లు ప్రాచీన శాసనాల నుండి, నాణేల నుండి ఉదహరించిన శాతవాహన రాజుల పేర్లతో చాలా వరకు సరిపోతున్నాయి. అందుచేత భండార్కర్, విన్సెంట్ స్మిత్, బర్జెస్, రాప్సన్ పండితులు శాతవాహనులు ఆంధ్రులేనని మగధలో శుంగవంశం విజృంభించిన సమయంలోనే వారు కృష్ణా, గోదావరీ మండలంలో విజృంభించి (రాప్సన్) పశ్చిమోత్తరసీమలకు విస్తరించినారని, శ్రీకాకుళం, ధాన్యకటక నగరాలు వారి మొదటి రాజధానులని (బర్జెస్, బార్నెట్) తీర్మానించినారు. వీరి మొదటి రాజధాని శ్రీకాకుళం కృష్ణాజిల్లాలో కలదు. శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రుల యొక్క భృత్యులని వాదించిన చరిత్రకారులు వి.యన్. సుక్తంకర్, శ్రీనివాస్ శాస్త్రి మొదలగు వారు. “అస్సక, ములక” జనపదాలను ఆంధ్రరాజ్యాలుగా సుత్తనిపాతపై వ్యాఖ్యా పేర్కొంటున్నది.
Satavahanas – Introduction – Satavahana Dynasty – Andhra Telangana
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులది. మౌర్యుల కాలంలో సామంతులుగా ఉండి కణ్వ వంశ కాలంలో స్వాతంత్యాన్ని ప్రకటించుకున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోటిలింగాలవద్ద వీరి పాలన ప్రారంభమై తరువాత ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా, మలిశాతవాహనుల కాలం నాటికి ధనకటకాన్ని (ధాన్యకటకం లేదా అమరావతి) రాజధానిగా చేసుకొని పాలించారు. వీరు ఉత్తరభారతదేశంలో మగథ వరకు తమ దిగ్విజయయాత్రను నిర్వహించారు. శాతవాహన సామ్రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు వ్యాపించింది. శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి గుర్తించదగిన సాంస్కృతిక సేవను అందించారు.
శాతవాహనులు కన్నా మునుపటి పాలకులు
కోటిలింగాలలో లభించిన నాణెములను బట్టి శాతవాహనుల కంటే ముందే ఈ క్రింది పాలకులు ఆంధ్ర దేశంలోని కోటిలింగాల నుండి పాలించారు.
1 గోబధ
2 నారన
3 కంవయాస
4 సిరవయాస
5 సమగోప
- వీరిలో గోబద/గోభద్రుడు భారతదేశంలోనే మొదటిగా నాణెములు వేయించాడని కొందరు చరిత్రకారులు పేర్కొంటారు.
- శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు వేయించిన నాణెములు కోటిలింగాల వద్ద లభించాయి. ఈ నాణెములు సమగోప వేయించిన నాణెములను పోలివున్నాయి
శాతవాహనులు గురించి క్లుప్తంగా
అంశం | వివరణ |
మొత్తం రాజులు | 30 |
పాలించిన కాలం | దాదాపు 450 సం (271 BC నుండి 174 AD ) |
స్థాపకుడు | శ్రీముఖుడు |
గొప్పవాడు | గౌతమీపుత్ర శాతకర్ణి |
చివరివాడు | 3వ పులోమావి |
రాజధానులు | 1. ప్రతిష్టానపురం 2. ధాన్యకటకం |
మతం | రాజులు – వైదికం రాణులు – బౌద్ధం |
రాజభాష | ప్రాకృతం |
రాజ లాంఛనం | సూర్యుడు |
వర్ణం : శాతవాహనులు బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు. (గౌతమీ బాలశ్రీ యొక్క నాసిక్ శాసనం ప్రకారం తెలుస్తుంది) గౌతమీపుత్ర శాతకర్ణికి గల బిరుదు క్షత్రియ దర్పమాణ మర్ధన క్షత్రియుల అహంకారాన్ని అణచివేసినవాడు) ప్రకారం వీరు క్షత్రియులు కారని తెలుస్తోంది.
శాతవాహనుల జన్మస్థలం
శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి ప్రధానంగా ఈ క్రింది సిద్ధాంతాలున్నాయి
1. ప్రతిష్టానపురం – పి.టి. శ్రీనివాస అయ్యంగార్ – శాతవాహనుల యొక్క శాసనములు మహారాష్ట్రలోని నాసిక్ లో లభ్యమవడం వలన వీరు నాసిక్ ప్రాంతం అని పేర్కొన్నారు.
2. విదర్భ – వి.వి.మిరాశీ – గౌతమీపుత్ర శాతకర్ణికి ‘బెనాటకస్వామి’ అనే బిరుదు కలదు. ఈ బిరుదు ‘కన్నాబెన్నా నది’ ఆధారంగా వచ్చినది. ఈ నది మహారాష్ట్రలోని వారా జిల్లాలో కన్వాస్ నదిగా ప్రవహిస్తు న్నది. కావున దీని ఆధారంగా వీరు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతమునకు చెందినవాడని పేర్కొన్నారు.
పల్లవ రాజు ‘శివస్కంధవర్మ’ యొక్క ‘హిరహడగల్లి శిలాశాసనం’, మూడవ పులోమామి యొక్క ‘మ్యాకదోని శాసనము’లలో పేర్కొన్న ‘రట్టి’ పదము ఆధారముగా వీరు కర్నాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందినవారుగా పేర్కొ న్నారు. ఈ కన్నడ వాదమును డా||కె.గోపాలాచారి గాలివాదముగా పేర్కొని కొట్టివేశారు.
4. ఆంధ్ర – గుత్తి వెంకట్రావ్, ఎ.స్మిత్, బార్హస్, బార్నెట్ – హాలుని వివాహం లీలావతితో తూర్పుగోదావరిలోని ద్రాక్షరామంలో జరిగింది. నాసిక్ శాసనంలో పేర్కొనబడిన పర్వతాలు ఆంధ్రా ప్రాంతంలోనివి కావడం వలన శాతవాహనులు ఆంధ్రా ప్రాంతం వారు అని పేర్కొన్నారు.
5. తెలంగాణ – పి.వి. పరబ్రహ్మశాస్త్రి, డి. రాజారెడ్డి, సంగన భట్ల నరసయ్య, బి.యన్. శాస్త్రి
ఇతర ముఖ్యాంశాలు
- 1. ఆంధ్ర అన్నది జాతినామం, శాతవాహన అన్నది రాజ్యవంశ నామం, శాతకర్ణి అనునది ఇంటి పేరు అని కె.ఎ.నీలకంఠశాస్త్రి పేర్కొన్నాడు.
- 2. శాతవాహనులు ఆర్యులు అని బి.ఎస్.ఎల్.హనుమంత రావు పేర్కొన్నాడు. శాతవాహనులను అస్సక జనపదా నికి చెందిన ఆంధ్రగణంగా బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.
- 3. శాతవాహనులు ఆంధ్రభృత్యులు అని వి.వి.మిరాషి, ఆర్.జి.భండార్కర్ పేర్కొనగా, శాతవాహనులు ఆంధ్రులే, ఆంధ్రభృత్యులు కాదు అని డి.సి.సర్కార్ పేర్కొన్నారు.
- 4. శాతవాహనులను ద్రావిడులుగా ‘ఆర్.ఎస్.బ్రహ్మ’ పేర్కొన్నారు.
శాతవాహన అనే వంశము పేరు రావడానికి గల కారణాలు : ద్వాత్రంశిక పుత్తలిక : సాతవాహనుడు అనే బ్రాహ్మణునికి, నాగస్త్రీకి జన్మించిన వారే శాతవాహనులు అందువలనే శాతవాహనులను బ్రాహ్మణ వర్గానికి చెందినవారుగా పరిగణిస్తారు.
దీపకర్ణి కథ : ‘దీపకర్ణికథ’ సోమదేవుడు రాసిన ‘కథాసరిత్సాగరంలో’ కలదు. దీని కారం సాతుడు అనే యక్షనికి, బ్రాహ్మణ స్త్రీకి జన్మించినవారు శాతవాహనులు