Satavahana – Genealogy – Family Tree – శాతవాహన వంశవృక్షం

శాతవాహన వంశవృక్షం – శాతవాహన రాజుల వంశవృక్షాన్ని లభించిన ఆధారాలను బట్టి కింద ఇవ్వడం జరిగింది.

శాతవాహన వంశనామం. సాతవాహన పదం శాతవాహనకు ప్రాకృత రూపం, శాసనాలలో ‘సాతవాహన’ కులానికి చెందినవారుగా పేర్కొనబడటం వల్ల ‘సాతవాహన’ వీరి వంశనామంగా పరిగణించవచ్చు. ఇటీవల కరీంనగర్ జిల్లా కోటిలింగాల వద్ద దొరికిన నాణేల ఆధారంగా పురాణాల్లో మొదటగా పేర్కొనబడిన సిముఖ సాతవాహనుడు, వంశ మూల పురుషుడైన సాదవాహనుడు ఇరువురూ ఒక్కరే అని నిర్థారించవచ్చు. సంస్కృతకోశం అభిధాన చింతామణి’ లో ఈ పదానికి సుఖ ప్రదమైన వాహనం కలవాడు అనే అర్ధముంది. ‘కథాసరిత్సాగరం’ అనే గ్రంథం ‘సాత’ అనే యక్షుని వాహనంగా కలవాడు సాతవాహనుడని పేర్కొన్నది. ఈ వంశానికి మూలపురుషుడు ఇతనేనని, ఇతని వారసులు ఈ పేరున తమ వంశనామంగా స్వీకరించారని భావించవచ్చు. కొండాపూర్, వరంగల్లు ప్రాంతాల్లో దొరికిన నాణేలపై ఉన్న “సాతవాహనుడు” ఇతడేనని చరిత్రకారులు భావిస్తున్నారు.

జినప్రభాసూరి అనే జైన రచయిత ప్రకారం వందలకొలది (శతాన్ని) వాహనాలను (వాహనాని) దానం చేసినందున శాతవాహనులయినారు. ప్రాచీన తమిళ కావ్యమైన శిలప్పాధికారంలో ‘నూర్వార్ కన్నార్’ అను పేరుంది. ఇది ‘శతకర్ణి’కి తమిళ రూపం. ముండారీ భాషలో ‘శాత’ అంటే గుర్రం అని హాన్, కర్ణి, పహాన్ మాటలకు కొడుకు అని అర్ధం ఉంది. అందుచేత అశ్వమేథం చేసిన రాజు సంతతి వారు శాతవాహనులైనారని ప్రజులుస్కి అనే పండితుని అభిప్రాయం. హేమచంద్రుని వ్యాకరణము “శాలివాహన” పదం శాతవాహనకు అపభ్రంశ రూపముగా చెప్పబడింది.

Satavahana – Genealogy – Family Tree – శాతవాహన వంశవృక్షం


శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. వంశంలో గొప్ప రాజు గా పేరు గాంచినవాడు గౌతమి పుత్ర శాతకర్ణి . 30 మంది శాతవాహన రాజులు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలన సాగించారు.

మత్స్యపురాణం ప్రకారం మొత్తం 30 మంది శాతవాహన పాలకులు ఉన్నారు. మత్స్యపురాణం ప్రకారం శాతవాహనులు క్రీ.పూ. 271 నుండి క్రీ.శ. 174 వరకు సుమారు 450 సంవత్సరాలు పాలించారు. కానీ, ఇతర ఆధారాల ప్రకారం వీరు క్రీ.పూ. 250 నుండి క్రీ.శ. 220 వరకు పాలించారు.
శాతవాహన పాలకులను తొలి శాతవాహనులు మరియు మలి శాతవాహనులుగా విభజించారు

  • తొలి శాతవాహనులు – 1 నుంచి 23 వరకు
  • మలి శాతవాహనులు – 24 నుంచి 30 వరకు
  • శాతవాహనుల్లో అందరికంటే గొప్పవాడు – గౌతమీపుత్ర శాతకర్ణి
  • తొలి శాతవాహనుల్లో గొప్పవాడు – 1వ శాతకర్ణి (3వ రాజు)
  • మలి శాతవాహనుల్లో గొప్పవాడు – యజ్ఞశ్రీ శాతకర్ణి(27వ రాజు)

Satavahana – Genealogy – Family Tree – శాతవాహన వంశవృక్షం


శ్రీముఖుడు(స్థాపకుడు)

కన్హుడు  / కృష్ణుడు

1వ శాతకర్ణి వేదశ్రీ శాతకర్ణి / పూర్ణోత్సంగుడు

2వ శాతకర్ణి

కుంతల శాతకర్ణి

1వ పులోమావి

హాలుడు

గౌతమీపుత్ర శాతకర్ణి
↓ 
2వ పులోమావి / వాశిష్టపుత్ర పులోమావి
↓ 
వాశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి
↓ 
యజ్ఞశ్రీ శాతకర్ణి

విజయశ్రీ శాతకర్ణి

చంద్రశ్రీ

3వ పులోమావి (చివరి శాతవాహన రాజు)

1) SIMUKA/ SUMUKHA ( 211 OR 212 BCE)
2) KRISHNA (188 0R 199 BCE)
3) VEDISRI AKARNI (170 OR 181 BCE)
4) PURNOTSANGA (160 OR 171)
5) SKANDASVATI I OR STAMBHA (142 OR 153 BCE)
6) AKARNI II (124 OR 153 BCE)
7) LAMBODARA (68 OR 97)
8) APILAKA (50 OR 79 BCE)
9) MEGHASVATI(38 OR 67 BCE)
10) SVATI (20 OR 49 BCE)
11) SKANDASVATI II (8 OR 31 BCE)
12) MRGENDRA SVATIKARNA (1 OR 24 BCE)
13) KUNTALA ( 3 OR 21 CE)
14) SVATISENA (11 OR 13 CE)
15) PULOMAVI (12 CE)
16) ARISTAKARNA (36 OR 23 CE)
17) HALA (61 OR 48 CE)
18) MANTALAKA (62 OR 58 CE)
19) PRAVILASENA (67 OR 58 CE)
20) SUNDARA AKARNI (79 CE)
21) CAKORA AKARNI (80 CE)
22) SIVASVATI (80-108)
23) GAUTAMIPUTRA AKARNI (108-139 CE)
24) PULOMAVI II ((139-167 CE)
25) SIVASRI AKARNI (167-196 CE)
26) SIVASKANDA AKARNI (195-203 CE)
27) YAJNASRI AKARNI (203 -232 CE)
28) VIJAYA AKARNI (232 -238 CE)
29) CANDASRI AKARNI (238-241 CE)
30) PULOMAVI III ( 241-248 CE)

Scroll to Top