1st Satakarni -Satavahana King – 1వ శాతకర్ణి శాతవాహనుల రాజు
వైవాహిక సంబంధాల ద్వారా సామ్రాజ్య విస్తరణకు కృషి చేసిన మొదటి శాతవాహన రాజు.
పురాణాలు ఇతన్ని ఈ క్రింది విధంగా పేర్కొన్నాయి
1. మహాన్
2. మల్లకర్ణ –
కొన్ని ముఖ్య విషయాలు:
- 1వ శాతకర్ణి విదర్భ, ఉజ్జయినిలను ఆక్రమించాడు
- ఇతను పుష్యమిత్ర శుంగుడిని ఓడించి, దానికి గుర్తుగా ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణెములు ముద్రించాడు.
- మొదటి శాతకర్ణి ‘గజగుర్తు’ గల నాణెములను ముద్రించారు.
- మొదటి శాతకర్ణి మొదటగా వెండి నాణెములు ముద్రించాడు.
- “చుళ్ళ కళింగ జాతకం”లో కళింగ పాలకుని పై అస్సకాధీశుని విజయం ఖారవేలుని పై మొదటి శాతకర్ణి విజయము అయ్యి వుంటుందని భావించవచ్చు.
ఇతని సమకాలీన పాలకులు :
- పుష్యమిత్ర శుంగుడు – మగధ
- ఖారవేలుడు – కళింగ
- డెమిట్రియస్ – ఇండో గ్రీకు (వాయువ్య భారత్)
- ఇతను కళింగ ఖారవేలుడి పై దండెత్తి తన సామ్రాజ్యాన్ని తూర్పు భారతదేశం వైపు విస్తరించినట్లుగా చళ్ళ కళింగ జాతక ద్వారా తెలుస్తుంది.
- మొదటి శాతకర్ణి డెమిట్రియను కూడా ఓడించాడు.
ఇతనిని పురాణాలు “మహాన్” అని పేర్కొన్నాయి. మత్స్యపురాణం మొదటి శాతకర్ణిని “మల్లకర్ణి” అని పేర్కొన్నది.
వైదిక మతం ప్రకారం యజ్ఞయాగాదులను నిర్వహించిన మొదటి రాజు. మొదట శాతథర్ణి ఈ యాగాల సందర్భంగా 36000 కర్షాపణాలు, 44000 గోవులు, 10 ఏనుగులు, 1000 గుర్రాలు, పన్ను మినహాయింపు భూములను బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు.
1వ శాతకర్ణి మొదటిగా వైదిక సాంప్రదాయాలను పాటించి ఒక రాజసూయ యాగం, రెండు అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. తను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మిహాయింపు భూములను దానంగా ఇచ్చాడు.
అతను బ్రాహ్మణులకు తొలిసారిగా వెండి నాణెములను దానం చేశాడు.
ఇతను వైవాహిక సంబంధాల ద్వారా సామ్రాజ్య విస్తరణకు కృషి చేసిన మొదటి శాతవాహన రాజు.
మొదటి శాతకర్ణి ఖారవేలునిపై విజయానికి సూచనగా ‘రెండు అశ్వమేథయాగాలు, ఒక రాజసూయ యాగం” తో సహా 20 యాగాలు చేశాడని నానాఘాట్ శాసనం వలన తెలుస్తుంది.