Types of Behaviors – ప్రవర్తన రకాలు, ప్రవర్తన అంశాలు, బాహ్య ప్రవర్తన, అంతర్ ప్రవర్తన. మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేసే రంగాలు/ ప్రవర్తనలు
Types of Behaviours – ప్రవర్తన రకాలు, ప్రవర్తన అంశాలు, బాహ్య ప్రవర్తన, అంతర్ ప్రవర్తన.
ప్రవర్తన రెండు రకాలు : 1. బాహ్య ప్రవర్తన, 2. అంతర్ ప్రవర్తన.
ప్రవర్తన అంశాలు : ప్రవర్తన అనే పదానికి చాలా విస్తృతార్థం ఉంది. మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు జీవి ప్రవర్తనను మూడు రంగాలకు అన్వయించారు.
1. జ్ఞానాత్మక రంగం, 2. భావావేశ రంగం, 3. మానసిక చలనాత్మక రంగం
1. జ్ఞానాత్మక రంగం : జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి: గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, వర్గీకరించడం ఉదాహరణలు ఇవ్వడం, భేదాలను గురించర సారూప్యాలను గుర్తించడం, లోపాలను చూపడం, విశ్లేషించడం, సంశ్లేషించడం మదింపు చేయడం, మూల్యాంకనం చేయడం, సమైక్యంగాను, విభిన్నంగాను ఆలోచించడం, ఊహించడం, స్మృతి, విస్మృతి, ధారణ, భావనలు, ప్రజ్ఞ మొదలైన ప్రవర్తనలన్నింటిని మనోవిజ్ఞానం అధ్యయనం చేస్తుంది.
2. భావావేశ రంగం : భావావేశ రంగానికి సంబంధించినవి అభిరుచులు, వైఖరులు. సహజ సామర్థ్యాలు, విలువలు, ఉద్వేగాలైన సంతోషం, ఆనందం, దయ, జాలి, ప్రేమ, వాత్సల్యం, దుఃఖం, బాధ, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, సాంఘిక ప్రవర్తనలు, నాయకత్వ లక్షణాలు మొదలైనవాటిని కూడా మనోవిజ్ఞానశాస్త్రం అధ్యయనం చేస్తుంది.
3. మానసిక చలనాత్మక రంగం : నడవడం, పరిగెత్తడం, పాడటం, ఆడటం, గీయడం, రాయడం, సేకరించడం, భద్రపరచడం, పరికరాలను, యంత్రాలను ఉపయోగించడం, నాట్యం చేయడం మొదలైన మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన చలనాత్మక క్రియాత్మక విషయాలను కూడా మనోవిజ్ఞానం అధ్యయనం చేస్తుంది.
ఈ విధంగా జీవికి సంబంధించిన అంతర్గత/ బహిర్గత ప్రవర్తనలన్నింటిని మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది.