Some More Educational Philosophers

Some More Educational Philosophers 

 

జాన్.యస్. డ్యూయీ (John. S. Dewey)
వ్యక్తి జీవితాన్ని, అతను పరిసరాలతో సర్దుబాటు చేసుకొనే కృత్యాలను వివరించే ‘వ్యవహారిక సత్తా వాదాన్ని’ (Pragmatism) రూపొందించిన అమెరికా తత్వవేత్త జాన్ డ్యూయీ. ఇతను పాఠశాలను చిన్న ‘మోతాదు సమాజం ‘గా (Miniature Society) తీర్చిదిద్దాలన్నాడు ” 

సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ (Sir Francis Galion)

డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలవల్ల ప్రభావితుడైన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనువంశికత-ప్రజ్ఞలకు ఉన్న సంబంధాన్ని గురించి అనేక పరిశోధనలు చేశాడు. ఇతను అనువంశకవాది (Hereditatian).

విలల్మ్ ఊంట్
ఈయన మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడంతో ఈ శాస్త్రానికి ఒక ప్రయోగశాస్త్ర స్థాయి వచ్చింది. దీంట్ తన పరిశోధన ఫలితాలను విద్యా విషయాలకు, అన్వయించాడు. స్టాన్లీ హాల్ (Stanley Hall 1884-1924) ఊంట్ ప్రయోగ పద్దతులను శిశు అధ్యయనానికి అన్వయించి అనేక కొత్త శిశు అధ్యయన పద్ధతులను రూపొందించాడు. 

విలియం జేమ్స్ (William James)
ఇతడు స్మృతి-విస్మృతి, అభ్యసన బదలాయింపు అనే విషయాల పై సిద్ధాంతాలను చేశాడు. ఆల్ ఫ్రెడ్ బినే (Alfred Binet) ప్రజ్ఞా మాపన ఉద్యమానికి ప్రారంభకుడు ఆల్ఫ్రెడ్ బినే. ఇతడు ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు. పిల్లలలో మందమతులెందుకుంటారో తెలుసుకోవడానికి అన్వేషణలు చేశాడు. 

ఇవాన్ పావ్లోవ్ (Ivan Pavlov) ..
ఇతడు రూపొందించిన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, బి.ఎఫ్.స్కిన్నర్ (B.F. Skinner) రూపకల్పన ఇచ్చిన కార్యసాధక అభ్యసన సిద్ధాంతం ఇ.ఎల్. థార్న్ డెక్ (E.L. Thorndike) అందించిన యత్న-దోష అభ్యసన సిద్దాంతం. గెస్టాలు వాదులు అందించిన ‘అంత దృష్టి అభ్యసనం’ (Learning through Insight) అభ్యసన ప్రక్రియలో, అనేక ప్రయోగాలకు, నియమాలకు, సూత్రాలకు దారితీసింది.

ఈ విధంగా అనేక శాస్త్రవేత్తల కృషి వల్ల మనోవిజ్ఞానం తత్వవేదాంత శాస్త్రాల నుంచి విడిపోయి ఒక స్వతంత్రశాస్త్రంగా రూపొందింది.

Scroll to Top