APPSC గ్రూప్-2 2023 నోటిఫికేషన్ విడుదల

APPSC: నిరుద్యోగులకు శుభవార్త… గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అమరావతి: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.

897 గ్రూప్‌-2 పోస్టులకు నోటిఫికేషన్‌ – 21 నుంచి దరఖాస్తు

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 897 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎపిపిఎస్‌సి కార్యదర్శి జె ప్రదీప్‌కుమార్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో గురువారం పొందుపరిచారు. 

వీటిల్లో 331 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 21 నుంచి జనవరి 10 అర్ధరాత్రి వరకు షషష.జూరష.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి తెలిపారు. ప్రాథమిక పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహిస్తామని వెల్లడించారు. జిఓ 5 ఆధారంగా ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్ట్‌) నుంచి ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ప్రధాన పరీక్ష నిర్వహణ తేదీలను తరువాత ప్రకటిస్తామని తెలిపారు.
శాఖల వారీ పోస్టుల వివరాలు, ఇతర వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌ www.psc.ap.gov.in లో అభ్యర్థులు పొందవచ్చన్నారు. 

సిలబస్‌ విడుదల

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌తోపాటు పరీక్ష సిలబస్‌నూ ఎపిపిఎస్‌సి విడుదల చేసింది. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిల్టీ సబ్జెక్టులో 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఒఎంఆర్‌ విధానంలో 150 నిమిషాలపాటు ఈ పరీక్ష జరుగనుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వంతు నెగిటివ్‌ మార్కు ఉంటుంది. ప్రధాన పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంతోపాటు ప్రశ్నలకు సమాధానాలు రాసే విధానం కూడా ఉంటుంది. దీనిని ఒఎంఆర్‌ విధానంలో నిర్వహించాలా? కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించాలా? అనేది కమిషన్‌ నిర్ణయిస్తుంది. 
పేపర్ 1లో ఆంధ్రప్రదేశ్‌ సోషల్‌ హిస్టరీ, భారత రాజ్యాంగం జనరల్‌ వ్యూ రెండు కలిపి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. దేశ, రాష్ట్ర ఎకనామీ సబ్జెక్టుతోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సబ్జెక్టు కలిపి 150 మార్కులకు పేపర్‌ా2 పరీక్ష జరగనుంది. రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు జరిగే ఈ పరీక్షల్లోనూ నెగిటివ్‌ మార్కులు ఉంటాయి. కటాఫ్‌ వివరాలను కమిషన్‌ వెల్లడించలేదు.

Scroll to Top