AP DSC 2024 Notification on 1st July 2024. The MEGA DSC 2024 Notification for 16347 Vacancies will be released on 1st July 2024. The Govt of AP cabinet met on 24th June 2024 and taken a decision to release the Notification. Details explained below. AP DSC 2024 Notification on 1st July 2024, AP DSC 2024 Vacancies, MEGA DSC 2024 District Wise Vacancies, AP DSC 2024 Subject Wise Vacancies
AP DSC 2024 Notification on 1st July 2024
16,347 పోస్టుల భర్తీకి సిద్ధం
అదే రోజు టెట్ పరీక్షకు కూడా
కేబినెట్ లో సుదీర్ఘ చర్చ.. ఆమోదం
రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగుల కలలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసు కుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేప ట్టింది.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జూలై 1న షెడ్యూలు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మెగా డీఎస్సీకి సోమ వారం కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో మొత్తం. 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు మార్గం సుగమ మైంది. ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేయనున్నారు. జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్లీ టెట్ నిర్వహిస్తారు. తొలుత టెట్ నిర్వ హించాలా? లేదా? అనే విషయంపై కేబినెట్లో చర్చిం చారు. తాజాగా బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారికి మేలు చేసేలా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా సూచన మేరకు నిర్ణయం తీసుకున్నారు.
గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయనందున ఈ ప్రభుత్వం మెగా డీఎస్సీని వీలై నంత వేగంగా పూర్తిచేయాలని భావిస్తోంది. గత ఐదేళ్లపాటు నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూశారు. ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో హడావుడిగా నోటిఫికే|షన్ జారీచేసినా పరీక్షలు నిర్వహించేలోగా ఎన్నికల కోడ్ అమ ల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపో యింది.
మరోవైపు ఎన్నికల సమ యంలో హామీ ఇచ్చినట్లుగా సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వం తరహాలో ఆదిగో ఇదిగో అని నిరుద్యోగులను మభ్యపెట్టకుండా ఇచ్చిన హామీ ప్రకారం వీలైనంత వేగంగా భర్తీ పూర్తిచేయాలని ప్రయత్నిస్తోంది. తొలి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ఎక్కువ సేపు చర్చ జరిగింది. టెట్ నిర్వ హిస్తే ఎలా చేయాలి? లేకుండా ఎలా చేయాలి? అనే దానిపై మంత్రి లోకేష్ టెట్ నిర్వహణకె మొగ్గు చూపారు